ఇంట్లో బల్లి ఉండకూడదు అంటే చేయాల్సిన 8 పనులు  

ఇంట్లో బల్లులు తిరిగితె ఎవరు మాత్రం చూడ్డానికి ఇష్టపడతారు? బల్లి మనం పెంచుకునే కుక్క పిల్ల లేదా పిల్లి కాదు కదా ఇష్టపడటానికి. బల్లిని చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది కొందరికి. అన్నం తింటున్నప్పుడు బల్లి కనబడితే వాంతులు చేసుకుంటారు కొందరు. బల్లి అంటే మనిషికి అంత అసహ్యం. ఇక బల్లి శాస్త్రాన్ని నమ్మే బ్యాచ్ మరొకటి. బల్లి ఇక్కడపడితే ఇలా జరుగుతుంది, అక్కడ పడితే అలా జరుగుతుంది అనుకుంటూ నసపెడుతుంటారు. ఈ బల్లి శాస్త్రం ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది మనకు అనవసరం కాని, ఒక విషయం ఏమిటంటే, మనకి బల్లి ఇంట్లో తిరగటం ఇష్టం లేదు. నిజానికి అది పురుగులని తినేస్తూ మనకు మేలు చేస్తుంది, అయినా బల్లి ఇంట్లో ఉండాలని ఎవరు కొరుకోరు. మరి బల్లి ఇంట్లో ఉండకూడదు అంటే ఏం చేయాలి?

1) ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం

బల్లి ఊరికే మీ ఇంట్లోకి రాదు .. మీ ఇంట్లో తలదాచుకునే అవకాశం దానికి ఉంటేనే మీ ఇంటిలోకి వస్తుంది. అంటే చెత్తచెదారంతో అపరిశుభ్రంగా ఉన్న ఇల్లు బల్లిని లోనికి రమ్మని ఆహ్వానిస్తుంది అన్నమాట. కాబట్టి సెల్ఫ్ కాని, స్టోర్ కాని, క్లీన్ గా ఉందో లేదో చూసుకోవాలి. వ్యాక్యూమ్ క్లీనర్ తో ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి, ఫర్నీచర్ ఎప్పటికప్పుడు దులుపుతూ ఉండండి, వాటిని అటుఇటు జరుపుతూ క్లీన్ చేయండి, పాత పేపర్లు, మ్యాగజీన్లలో కూడా బల్లిలు దాక్కుంటాయి గమనించండి, ఇంటి వాతావరణం శుభ్రంగా చల్లగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే వేడి ఎక్కువ ఉన్నచోటే బల్లులు ఎక్కువుంటాయి.