How to get over with hang over quickly ?

ఓ మంచి బ్రాండు తాగుతున్నారు అనుకోండి, ఆరోజు మందుబాబుల హడావుడి మాములుగా ఉండదు. ఇక మళ్ళీ ఈ బ్రాండ్ ఎప్పుడు దొరుకుతుందో అనే కక్కుర్తితో ఎక్కువ తాగేస్తారు. ఫలితం ? తెల్లారి తలనొప్పి. దాన్ని ముద్దుగా హ్యాంగోవర్ అంటారు. కొంతమంది మరీ టూ మచ్ గా తాగకపోయినా తలనొప్పి వేస్తుంది. కొందరి బాడి టైప్ అంతే. మామూలు తలనొప్పికి, ఈ తలనొప్పికి చాలా తేడా ఉంటుంది. రెండిటి లక్షణాలు కూడా వేరే ఉంటాయి. తలనొప్పితో పాటు, వాంతులు, అలసట, అలసట .. ఇలా పలు లక్షణాలు కనబడతాయి. మరి ఈ హ్యాంగోవర్ తలనొప్పిని వదిలించుకునేది ఎలా ? ఏం చేయాలి ?

* మంచినీళ్ళు బాగా తాగండి :


ఈ హ్యాంగోవర్ రావడం వెనుక చిన్న సైన్స్ ఉంది. మందు బాగా తాగితే ఏమవుతుంది ? మూత్రం మంచుకువస్తుంది. దాంతో ఎక్కువసార్లు మూత్రానికి వెళ్తారు. దాంతో శరీరం డీహైడ్రేట్ అయిపోతుంది. అంటే నీటి శాతం పడిపోతుంది. దాంతో తలనొప్పి పుడుతుంది. అందుకే, తెల్లారి లేవగానే ముందుగా మంచినీళ్ళు తాగాలి. చెప్పాలంటే, రాత్రి మద్యం తాగినా, తాగకపోయినా, లేవగానే నీళ్ళు తాగాలి.

* కొబ్బరినీళ్ళు తాగండి :


రక్తంలో ఉండే అయిదు ఎలక్ట్రోలైట్స్ కొబ్బరినీళ్ళలో ఉంటాయి. కాబట్టి కొబ్బరినీళ్ళు చాలా త్వరగా మన శరీరాన్ని పూర్వస్థితిలోకి తీసుకువెళ్తాయి. అంటే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ని వెంటనే రీస్టోర్ చేస్తాయి కొబ్బరినీళ్ళు. ఇందులో పొటాషియం పాళ్ళు కూడా ఎక్కువ. అలాగే డిహైడ్రెషన్ సమస్య కూడా దూరమైపోతుంది.