క్యాన్సర్ కణాలని నిరోధించే కాయలు ఇవే..     2017-09-14   22:42:22  IST  Lakshmi P

ఆరకాకరకాయ..చిన్న సైజు పరిమాణంలో ఉంటుంది..ఇది కాకరకాయ జాతికి చెందినదే అయితే ఈ ఆరకాకరకాయ చేదు ఉండదు. ఈ కాకరకాయని ఆహారంలో తీసుకోవడం వలన మధుమేహం ,గుండె జబ్బులు ,అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు .

ఆకాకరకాయలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది.ఇది శరీరంలో ఉండే వ్యర్ధాలని బయటకి పంపుతుంది. ఇది రక్తంలో చెక్కెర స్థాయిని తగ్గించి..ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది అందుకే షుగర్ ఉన్న వాళ్ళు ఈ ఆకాకరకాయ ని తినడం చాలా మంచిది . దీనిలో ఉండే ఒక ప్రత్యేకమైన గుణం ఏమిటంటే క్యాన్సర్ కణాలు వృద్ది కాకుండా వాటిని నివారిస్తాయి.శరీరంలో ఏర్పడే కణితులని నిర్మూలించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.ఇందులో ఉండే విటమిన్ “సి” శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్ లతో పోరాడుతుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్న ఈ కాకర చర్మాన్ని కాపాడుతాయి ఇందులో ఉంటే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది.

గర్భిణులు ఈ ఆరకాకరని తీసుకోవడం వలన లోపల ఉండే శిశువు ఎదుగుదలకి తోడ్పడుతుంది.ఇందులో ఉండే పోలేట్ శరీరంలో కొత్త కణాల వృద్ధికి తోడ్పడుతుంది. ఇందులో ఉండే ఫూటో న్యూట్రియంట్లు కాలేయం, కండడరాల కణజాలానికి బలాన్ని చేకూరుస్తాయి.మూత్రపిండాల సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ఆరకాకర కాయలు వాడటం చాలా మంచిది అని వైద్యులు చెప్తున్నారు.