How to clean your ears in a healthy way

చెవులు చాలా సెన్సిటివ్ గా ఉంటాయండి. చాలా అంటే చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. చెవిలో గులిమి ఉంటే చూడ్డానికి బాగా అనిపించకపోవచ్చు. మన శరీరం ఎప్పటికప్పుడు ఇయర్ వ్యాక్స్ విడుదల చేస్తూనే ఉంటుంది. ఇది మన చెవిని రక్షించడానికే శరీరం చేసే పని. కాబట్టి చెవుల్లో గులిమి, ఏదైనా చెత్త ఉంటే శుభ్రం చేసుకోవడంలో తప్పు లేదు. కాని ఎలా పడితే అలా శుభ్రపరుచుకోకూడదు. చెప్పాంగా, చెవులు చాలా సెన్సిటివ్ అని. ఏమాత్రం తేడా కొట్టినా, మీ చెవులకి, వినికిడి శక్తికి ప్రమాదం. కాబట్టి చెవులని ఎలా శుభ్రపరుచుకోవాలో కొన్ని చిట్కాలు చెబుతున్నాం చూడండి.

* గోరువెచ్చని నీరు చెవుల్లోని పాత గులిమి, బ్యాక్టీరియాని ఈజీగా తొలగిస్తుంది. కొన్ని గోరువెచ్చని నీటి చుక్కలని చెవిలో వేసుకోని, తలవంచి కాటన్ బాల్స్ తో శుభ్రం చేసుకోండి.

* రబ్బింగ్ ఆల్కహాల్, వెనిగర్ ని కలిపి ఓ మిశ్రమంలా తయారుచేసుకోని, కాటన్ బాల్స్ ని ముంచి, చెవుల్ల చుక్కలు పోసుకొని, ఆ ఐదారు నిమిషాల తరువాత శుభ్రం చేసుకోండి.

* ఆలీవ్ ఆయిల్ కూడా చెవులో గులిమి, చెత్తను తొలగిస్తుంది. కాటన్ బాల్స్ తో కొన్ని చుక్కలు పోసుకొని, ఓ పది నిమిషాలు అలానే ఉంచుకోని మెల్లిగా శుభ్రం చేసుకోండి.

* సెలైన్ వాటర్ కూడా చెవుల్ని శుభ్రపరుచుకోవడానికి ఉపయోగిస్తారు తెలుసా? సెలైన్ వాటర్ లో కాటన్ బాల్స్ ముంచి, చెవుల్లో చుక్కులు వేసుకోని ఓ పదిహేను నిమిషాలు అలానే ఉంచి, ఆ తరువాత కాటన్ తో తుడుచుకోండి.