చింతపండును చర్మానికి రాస్తే ఏమవుతుందో తెలుసా  

చింతపండును చర్మానికి రాస్తే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. చింతపండు రుచిలో పుల్లగా ఉన్నా చర్మంపై అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే ఇప్పుడు చింతపండును నేరుగా రాయకుండా పాక్స్ తయారుచేసుకొని వాడాలి. ఆ పాక్స్ ఎలా తయారుచేసుకోవాలి. అవి ఎలా సహాయపడతాయో వివరంగా తెలుసుకుందాం.

చింతపండును నానబెట్టి గుజ్జు తీయాలి. ఒక స్పూన్ గుజ్జులో చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసి ఆరాక గోరువెచ్చని నీటిటో శుభ్రం చేసుకోవాలి.

ఒక స్పూన్ చింతపండు గుజ్జులో అరస్పూన్ పెరుగు,చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి ఆరాక గోరువెచ్చని నీటిటో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ కారణంగా మూసుకుపోయిన చర్మ రంద్రాలు తెరుచుకుంటాయి. అయితే పెరుగు అలర్జీ ఉన్నవారు మాత్రం పెరుగుకు బదులు పాలను ఉపయోగించవచ్చు.

రెండు స్పూన్ల చింతపండు గుజ్జులో అరస్పూన్ నిమ్మరసం,బేకింగ్ సోడా,ఒక స్పూన్ పంచదార వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటిటో శుభ్రం చేసుకోవాలి.ఈ ప్యాక్ వారంలో మూడు సార్లు వేసుకుంటే మొటిమల సమస్య నుండి బయట పడవచ్చు.
చింతపండులో నీటిని పోసి బాగా ఉడికించి ఆ నీటిని వడకట్టాలి. ఆ నీటిలో 4 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ని వేసి ముఖానికి రాయాలి. ఏది స్కిన్ టోనర్ గా పనిచేస్తుంది.