How lemon juice helps Pimples – acne

నిమ్మరసంతో తేనే,పెరుగు,రోజ్ వాటర్,గుడ్డు తెల్ల సోన ,నీరు మొదలైన పదార్దాలను కలిపి సులభమైన మరియు ప్రభావవంతమైన ఇంటి నివారణలను తయారుచేయవచ్చు. ఇప్పుడు ఆ ఇంటి నివారణల గురించి వివరంగా తెలుసుకుందాం.

1. నిమ్మరసం రాయటం
నిమ్మరసంను డైరెక్ట్ గా ముఖం మీద రాస్తే మొటిమలకు కారణం అయిన దుమ్ము,ధూళి, మలినాలు చర్మ రంద్రాల ద్వారా బయటకు పోతాయి. ఇది మొటిమల నివారణకు అత్యంత సులభమైన మరియు సమర్థవంతమైన ఇంటి చికిత్సగా చెప్పవచ్చు.

కావలసినవి

నిమ్మకాయ – 1
నీరు – అవసరమైతే
కాటన్ బాల్ – 1
తేలికపాటి సబ్బు
ఒక చిన్న గిన్నె

పద్దతి

1. తేలికపాటి సబ్బుతో ముఖాన్ని శుభ్రంగా కడిగి ఆ తర్వాత పొడి టవల్ తో శుభ్రంగా తుడుచుకోవాలి.
2. నిమ్మకాయను రెండు బాగాలుగా కోసి రసాన్ని ఒక గిన్నెలోకి తీయాలి.
3. ఈ నిమ్మరసంలో కాటన్ బాల్ ముంచి మొటిమలు ఉన్న ప్రాంతంలో రాయాలి.
4. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.
5. ఈ విధంగా ప్రతి రోజు రెండు సార్లు చేస్తే మొటిమలు తగ్గిపోతాయి.