కాశీకి వెళ్లినప్పుడు ఇష్టమైన వాటిని ఎందుకు వదులుతారో తెలుసా?     2018-06-11   02:36:30  IST  Raghu V

పరమాత్మ ఈ శరీరం,ఇంద్రియాలు,బుద్ది,మనస్సు,అవయవాలు అన్నిటిని ఇచ్చారు. పరమాత్మ ఇచ్చిన వీటితో ఆయనకు సేవ చేయాలి. మనస్సుతో ధ్యానం చేయటం,చేతులతో పూజ చేయటం, నాలుకతో భగవంతుణ్ణి నామస్మరణ చేయటం,కనులతో స్వామిని చూడటం,చెవులతో భగవంతుని కథలను వినటం,భగవంతుని పాదాలపై ఉంచిన తులసి మాలను ముక్కుతో వాసన చూడటం, కాళ్లతో దేవాలయాలకు,భక్తుల ఇళ్లకు వెళ్ళటం,మాట్లాడిన నాలుగు మాటలలో ఒకటి భగవంతుని గురించి మాట్లాడటం వంటివి చేస్తే సంసారంలో ఉన్నా సన్యాసంలో ఉన్నట్టే.?

కానీ కన్ను, ముక్కు, చెవులు, నాలుకకు ప్రకృతిలో లభించేవే ఇష్టం. ఇలా చేయటం ఎవరికైనా కష్టమే. మన ఇష్టాల కోసం భగవంతుని వదులుకుంటున్నాం. ఈ విధంగా చేయటం వలన కష్టాలే ఎక్కువగా వస్తాయి. ఎక్కువగా తింటే అజీర్ణం వంటివి వస్తాయి. భగవంతుణ్ణి వదిలి ఇష్టాలను పట్టుకుంటే కష్టాలు ఎదురవుతాయి. అదే మన శరీరానికి బాగా ఇష్టమైన వాటిని భగవంతుని కోసం వదిలితే మనసు, బుద్ధి, శరీరం ప్రసన్నంగా, ఆరోగ్యంగా ఉంటాయి.