ఢీ – జూనియర్స్ విన్నర్ వర్షిణి గుర్తుందా..? ఇప్పుడెలా ఉందో చూడండి..!    2018-06-18   03:31:33  IST  Raghu V

దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షో ఢీ..ఇప్పటికి తొమ్మిది సీజన్స్ దిగ్విజయంగా ముగించుకుని పదవ సీజన్ రన్ అవుతుంది..మొదటి సీజన్ నుండి కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతూ సాగుతుంది ఈ అల్టిమేట్ డ్యాన్స్ షో.ఇప్పటివరకూ తెలుగు టీవీ చరిత్రలో ,సౌతిండియా టీవి చరిత్రలో ఇలాంటి ప్రొగ్రాం రాలేదనడంలో అతిశయోక్తి లేదు.ఇప్పటివరకూ ఎందరో డ్యాన్సర్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది.

ఒక్కొక్కరి ఫెర్మార్మన్స్ చూస్తుంటే వీళ్ల ఒంట్లో ఎముకలున్నాయా అసలు అనిపిస్తుంది.కొన్ని సార్లు ఒళ్లు గగుర్పొడిచేంత భయంకరమైన స్టెప్స్ కూడా వేస్తుంటారు డ్యాన్సర్స్.అవన్నీ బుల్లి తెర ప్రేక్షకులకు చాలా దగ్గరనుండి చూపించిన షో ఢీ..ఒక జబర్దస్త్ ఎందరో కమెడియన్స్ ని ఇండస్ట్రీకి ఇస్తే ,ఢీ కూడా ఎందరికో దారి చూపించింది.భానుమతి అలియాస్ సాయి పల్లవి ఈ షో ద్వారానే ముందు పేరు తెచ్చుకుంది..ఈ షోలో జూనియర్స్ కేటగిరీ లో పార్టిసిపేట్ చేసిన చిన్నారి వర్షిణి గుర్తుందా..ఇప్పుడెలా ఉందో తెలుసా…..