మహిళలు పిల్లల్ని కనే శక్తిని ఇవి ఎలా తగ్గిస్తాయి అంటే  

మనకు కొత్తగా తెలియని విషయం కాదు. సోడా, కూల్ డ్రింక్స్ లో ఉండే ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ (రుచి కోసం కలిపేవి) మన శరీరానికి చాలా హానికరం. మరి ముఖ్యంగా ఇవి మహిళలకి అస్సలు మంచివి కావు అని, ఇంఫర్టిలిటికి (పిల్లల్ని కనే శక్తి తగ్గడం) ఇవి కారణం అవుతాయని IVF (In Vitro fertilization) నిపుణులు కూడా వాదించడం ఇప్పుడు భారతీయ మెడికల్ రంగంలో ఓ పెద్ద చర్చ అయ్యింది. ఇలా జరగడానికి కారణం Aspartame అనే ఆర్టిఫిషియల్ స్వీటనర్ ఉండటమే అంట. ఈ కెమికల్ ఏండోక్రైన్ సిస్టంని ఇబ్బందులకి గురి చేసి, హార్మోన్స్ లో సమతూల్యాన్ని దెబ్బతీసి, స్త్రీ శరీరం తల్లి అయ్యే అవకాశం తగ్గిస్తుందట.

ఈ విషయంపై డిల్లీకి చెందిన అరవింద్ వైద్ అనే IVF నిపుణుడు మాట్లాడుతూ “దాదాపుగా అన్ని సోడాలు, కూల్ డ్రింక్స్ లో Aspartame కలుపుతున్నారు. ఇది ఎన్నోరకాల ఇబ్బందులకి కారణం అవుతుంది. కొన్ని చెప్పుకోవాలంటే పిల్లల్ని కనే శక్తి తగ్గడం, గర్భస్రావం, ఒవలుటరి దిజార్డర్స్, హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పడం .. ఇలాంటివి.” అంటూ చెప్పారు.

ఇక మరో IVF నిపుణురాలు రచన జైస్వార్ మాట్లాడుతూ “సోడా, కూలు డ్రింక్స్ ఎక్కువ అసిడిక్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఎక్కువ తాగితే శరీరంలో pH లెవెల్స్ దెబ్బతింటాయి. ఎక్కువ తాగితే మహిళలకే కాదు, పురుషులకి కూడా ప్రమాదమే. ఎందుకంటే ఇది ఒంట్లో ఫ్రీ రాడికల్స్ పెంచడంతో పాటు, పురుషుల వీర్యాన్ని బలహీనపరుస్తుంది. క్యాండ్ ఫుడ్స్, ప్లాస్టిక్ బాటిల్స్ లో ఉండే Bhispenol A కూడా వీర్యానికి ప్రమాదమే. ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగితే వీర్య కణాల కౌంట్ 4 రెట్లు కిందికి పడిపోతుంది. అందుకే స్త్రీ పురుషులిద్దరు ఈ కూల్ డ్రింక్స్ ని, సోడాని తాగడం మానెయ్యాలి. కాసేపు రుచి కోసం మీ శరీనికి హాని చేయొద్దు” అంటూ తన వెర్షన్ వినిపించారు.

చూసారా … IVF నిపుణుల మెడికల్ జ్ఞానం అపారమైనది. అలాంటి వారే ఇలాంటి మాటలు మాట్లాడున్నారంటే మనం కూల్ డ్రింక్ తాగడం మానేస్తేనే మంచిదేమో. ఎండాకాలంలో టెంప్ట్ అవడం సహజం కాని, ఆ రుచి కన్నా మనకు ఆరోగ్యం ముఖ్యం కదా.