పురుషాంగం ఎలా స్తంభిస్తుంది? దీని వెనుక సైన్స్ ఏమిటి?

పురుషుడి అంగం ఎలాంటి సందర్భాల్లో స్తంభిస్తుందో మీకు తెలియనిది కాదు. ప్రధానంగా పురుషుడి అంగం మూడు సందర్భాల్లో స్తంభిస్తుంది. అయితే అతడికి కామోద్రేకం కలిగినప్పుడు, లేదంటే మూత్రాన్ని ముద్రలో ఆపినప్పుడు, రెండు కాకుంటే, నిద్రలోనే తమకు తెలియకుండానే అంగం స్తంభించడం ‌. కామోద్రేకం ఎలాంటి సందర్భాల్లో కలుగుతుంది అనేది మీ అందరికీ తెలిసిన విషయం ‌. కానీ అంగం ఎలా స్తంభిస్తుందో తెలుసా? శరీరంలో ఎలాంటి మార్పులు జరగడం వలన అంగం గట్టిపడుతుంది? ఎందుకు గట్టిపడుతుంది? కొందరికి అంగస్తంభన సమస్యలు ఉంటాయి? అలా కొందరు పురుషులకు ఎందుకు జరుగుతుంది? దీని వెనుక సైన్సు ఏమిటి?

పురుషుడి అంగం లో 2 చాంబర్స్ ఉంటాయి. వాటిని corpora cavernosa అని అంటారు. ఈ రెండు చాంబర్స్ పురుషాంగం యొక్క శీర్షం నుంచి pelvis దాకా విస్తరించి ఉంటాయి. ఈ ఛాంబర్స్ లో స్పాంజిని తలపించే టిష్యులు ఉంటాయి. వీటికి చిన్నగా, పెద్ద గా మారే గుణం ఉంటుంది. ఇవి రక్తాన్ని స్టోర్ చేసుకోగలవు. పురుషులు కామోద్రేకంలో లేనప్పుడు, అంటే మామూలుగా పనులు చేసుకుంటున్నప్పుడు ఏ రక్తనాళాలైతే ఈ ఛాంబర్ కి రక్తాన్ని సరఫరా చేస్తాయో, అవి పూర్తిగా తెరుచుకొని ఉండవు. అందుకే పురుషాంగం కామోద్రేకం లేని సమయాల్లో నార్మల్ గా ఉంటుంది. దాని ఆకృతి లో ఎలాంటి మార్పులూ ఉండవు. కానీ కామోద్రేకం కలిగినప్పుడు అనేక మార్పులు జరుగుతాయి.