పురుషాంగం ఎలా స్తంభిస్తుంది? దీని వెనుక సైన్స్ ఏమిటి?

అంగస్తంభన చర్య పురుషుడి మెదడులో మొదలవుతుంది. కనులతో ఏదైనా చూసినప్పుడు, వాసన విన్నప్పుడు, కామోద్రేకం కలిగించే విషయాన్ని విన్నప్పుడు, లేదంటే కామోద్రేకం కలిగించే తాకిడి జరిగినప్పుడు, పై విషయాలు తీవ్రతను బట్టి, వాటిలోని కామోద్రేక ఆసక్తిని బట్టి, పురుషుడి మెదడు కొన్ని హార్మోనల్ మార్పులకు, కెమికల్ రియాక్షన్స్ కి రంగం సిద్ధం చేస్తుంది. Arteries కి సందేశాన్ని పంపి ఎక్కువ రక్తం పురుషాంగాన్ని చేరేలా చేస్తుంది. అలాగే veins పనితనాన్ని ఆపేసి కామోద్రేకం తగ్గేదాకా పురుషుడి అంగం నుంచి రక్తం రాకుండా, అంటే పురుషుడి అంగం మెత్తబడకుండా జాగ్రత్త పడుతుంది. పురుషాంగం లోని చాంబర్ టిష్యులు పరిమాణంలో పెరగడం వలన పురుషాంగం కూడా సైజులో పెద్దగా మారి అంగం గట్టిపడుతుంది. ఇదే అంగస్తంభన వెనుక దాగున్న సైన్స్.

ఈ ప్రాసెస్ లో ఎలాంటి అడ్డంకులు ఉన్నా అంగస్తంభన సమస్యలు వస్తాయి. అంటే పురుషుడికి బేసిక్ గా కామోద్రేకం కలగకపోవడం, అంటే శృంగారం మీద ఆసక్తి తగ్గడం, హార్మోనల్ మార్పులు, రక్త సరఫరా సమస్యలు .. వీటిలో అనారోగ్యకరమైన మార్పులు వస్తే అంగం స్తంభించదు.