పగిలిన పెదవులకు సహజసిద్దమైన స్క్రబ్స్     2018-06-23   00:36:31  IST  Lakshmi P

పెదవులు పగిలితే ముఖం చిరాకుగా ఉండటమే కాకుండా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు అందమైన పెదాలు కావాలని కోరుకుంటారు. అయితే అందమైన పెదాల కోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే మనకు అందుబాటులో ఉండే కొన్ని సహజసిద్ధమైన పదార్ధాలతో పగిలిన పెదాలను మృదువుగా,అందంగా చేసుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒక స్పూన్ ఉడికించిన ఓట్ మీల్ లో ఒక స్పూన్ బాదం నూనె వేసి బాగా కలిపి పెదవులపై రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. 5 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.