ప్రకాశవంతమైన మెరిసే చర్మం కోసం ఆరెంజ్ పేస్ పాక్స్     2018-04-13   01:14:36  IST  Lakshmi P

ఆరెంజ్ లో యాంటిఆక్సిడెంట్లు, ముఖ్యమైన ఖనిజాలు మరియు విటమిన్స్ సమృద్ధిగా ఉండుట వలన మనకు ఆరోగ్య ప్రయోజనాలను ఇవ్వటమే కాకుండా చర్మ సంరక్షణకు కూడా సహాయపడుతుంది. ఆరెంజ్ పేస్ పాక్స్ వేసవిలో చాలా బాగా సహాయపడతాయి. చర్మంపై ఉన్న ట్యాన్,నల్లని మచ్చలు,జిడ్డు తొలగించటానికి చాల సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం కాంతివంతంగా మారటానికి సహాయపడతాయి. ఇప్పుడు ఆ పాక్స్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.


ఒక స్పూన్ ఆరెంజ్ రసంలో అర స్పూన్ తేనే కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.