చీము పట్టిన మొటిమలకు సమర్ధవంతమైన పేస్ ప్యాక్    2018-07-07   00:43:32  IST 

సాధారణంగా మొటిమలు వస్తేనే చాలా చిరాకు వస్తుంది. అవి కొంతమందిలో తొందరగా తగ్గితే మరికొంతమందిలో చీము పట్టి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. అలాంటప్పుడు కంగారు పడకుండా ఆ సమస్య నుండి ఇంటి చిట్కాల ద్వారా చాలా సులభంగా బయట పడవచ్చు. ఇప్పుడు ఆ చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒక స్పూన్ కొబ్బరి నూనెలో మూడు చుక్కల ట్రీ టీ ఆయిల్,చిటికెడు పసుపు కలిపి ప్రభావిత ప్రాంతంపై రాసి 5 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఒక స్పూన్ నిమ్మరసంలో అరస్పూన్ ముల్టానా మట్టి వేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంపై రాసి 5 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

ఒక స్పూన్ కలబంద జ్యుస్ లో అరస్పూన్ బేకింగ్ సోడా కలిపి ప్రభావిత ప్రాంతంపై రాసి 5 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.

బంగాళాదుంప తొక్కలను మెత్తని పేస్ట్ గా చేసి దానిలో గ్రీన్ టీ పొడిని కలిపి ప్రభావిత ప్రాంతంపై రాసి 5 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే చీము పట్టిన మొటిమలు తగ్గటమే కాకుండా మచ్చలు కూడా తగ్గిపోతాయి.