మృదువైన,అందమైన,ఎర్రటి పెదాల కోసం అద్భుతమైన చిట్కాలు    2018-05-14   23:32:06  IST  Lakshmi P

సాధారణంగా ప్రతి ఒక్కరు పెదాలు చాలా ఆకర్షణీయంగా,అందంగా కనపడటానికి మార్కెట్ లో దొరికే అనేక రకాల ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ ఉంటారు. అవి చాలా ఖరీదైనవి. కానీ ఈ కాస్మొటిక్స్ ఎక్కువ కాలం వాడితే పెదాలు పొడిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనం కాస్మొటిక్స్ జోలికి వెళ్లకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని పదార్ధాలతో మృదువైన,అందమైన పెదాలను సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒక స్పూన్ తేనెలో అరస్పూన్ పంచదార కలిపి పెదాలకు రాసి 5 నిముషాలు సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని పెట్రోలియం జెల్లీ రాయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే పెదాలు మృదువుగా మారతాయి.