ముఖ చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండాలంటే ఫ్రూట్ పేస్ పాక్స్     2018-06-28   00:18:04  IST  Lakshmi P

ముఖం పొడిగా ఉంటే చర్మం కాంతివిహీనంగా,గరుకుగా ఉండి మృదుత్వాన్ని కోల్పోతుంది. అదే చర్మం తేమగా ఉంటే కాంతివంతంగా మృదువుగా మెరుస్తూ ఉంటుంది. కొన్ని ఫ్రూట్ పేస్ పాక్స్ ని ఉపయోగిస్తే పొడిగా ఉన్న ముఖం తేమతో కాంతివంతంగా మారుతుంది. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒక స్పూన్ కలబంద జెల్ లో రెండు స్పూన్ల ఆరెంజ్ జ్యుస్ కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.

ఒక స్పూన్ శనగపిండిలో సరిపడా దానిమ్మ రసాన్ని కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ని పదిహేను రోజులకు ఒకసారి వేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.