జిడ్డు సమస్య నుండి బయట పడటానికి అద్భుతమైన పాక్స్     2018-05-05   23:24:25  IST  Lakshmi P

కొంత మంది చర్మం చాలా జిడ్డుగా ఉంటుంది. ఎందుకంటే వారి చర్మంలో సేబాషియస్ గ్రంధులు ఎక్కువగా ఉండటమే. చర్మం జిడ్డుగా ఉండుట వలన చర్మం కాంతివిహీనంగా మారుతుంది. అంతేకాక చర్మం పగిలే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఖరీదైన కాస్మొటిక్స్ వాడకుండా ఇంటిలో దొరికే సహజసిద్ధమైన పదార్ధాలతో జిడ్డు సమస్యను సమర్ధవంతంగా తొలగించవచ్చు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒక స్పూన్ బ్రౌన్ షుగర్ లో రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖానికి రాశి 5 నిమిషాల పాటు స్క్రబ్ చేయాలి. అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మంలో అధికంగా ఉన్న జిడ్డు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.