Home tips to prevent worms,insects from stored rice

ఎంతో ఖర్చు చేసి తెచ్చిన బియ్యం కొన్ని రోజులకే పురుగు పట్టిందంటే చాలా బాధ కలుగుతుంది. అలాగే ఆ బియ్యాన్ని వాడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాగే ఆ బియ్యాన్ని శుభ్రం చేయాలన్నా చాలా కష్టం. అందుకే ఇప్పుడు బియ్యం పురుగు పట్టకుండా ఉండటానికి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.

కర్పూరం<Br/> ఘాటైన వాసనతో ఉండే కర్పూరం బియ్యంలో పురుగు పట్టకుండా చేస్తుంది. కర్పూరం బిళ్లలను పొడి చేసుకొని మందపాటి వస్త్రంలో మూట కట్టి వేయాలి.

వేపాకులు
బియ్యాన్ని తెచ్చిన వెంటనే బియ్యంలో వేపాకులు వేస్తె పురుగు పట్టదు. వేపాకు లో ఉండే క్రిమి సంహారక లక్షణాలు బియ్యం పురుగు పట్టకుండా చేస్తాయి. బియ్యంలో నేరుగా వేపాకులు వేయవచ్చు. లేదా వేపాకులను ఎండలో ఎండ బెట్టి పొడి చేసి ఒక వస్త్రంలో మూట కట్టి బియ్యంలో వేయవచ్చు . ఈ విధముగ చేయటం వలన బియ్యంలో తెల్ల పురుగులు మరియు ముక్కు పురుగులు కూడా చేరవు.