Home Remedies to Remove Dark Circles naturally

మారుతున్న జీవనశైలి కారణంగా ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కంటి కింద నల్లని వలయాలు ఏర్పడుతున్నాయి. సాధారణంగా ఈ నల్లటి వలయాలు కనపడగానే మార్కెట్ కి వెళ్లి ఏదో క్రీమ్ తెచ్చేసి రాసేస్తూ ఉంటాం. కానీ ఆ విధంగా చేయటం చాల తప్పు. మనకు ఇంటిలో అందుబాటులో ఉండే కొన్ని వస్తువుల ద్వారా ఈ నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు.

పుదీనా ఆకులను పేస్ట్ గా చేసి కంటి చుట్టూ ప్యాక్ వేయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

కంటి కింద నల్లటి వలయాలను తగ్గించటంలో టమోటా చాల సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఒక టమోటా పేస్టులో ఒక స్పూన్ నిమ్మ రసం,చిటికెడు పసుపు,చిటికెడు శనగపిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని కంటి చుట్టూ రాసి అరగంట తర్వాత శుభ్రం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

రోజ్ వాటర్ లో కాటన్ బాల్ ముంచి కంటి మీద పెట్టుకొని పది నిమిషాల తర్వాత తీసేసి చల్లని నీటితో కడిగితే కంటి చుట్టూ చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.