Home Remedies To Get Rid of Water Weight

2. పుచ్చకాయ:

పుచ్చకాయలో మెగ్నీషియం, విటమిన్ ఎ మరియు సి సమృద్దిగా ఉంటాయి. పుచ్చకాయ ముక్కలలో నల్ల ఉప్పు కలుపుకొని తినవచ్చు. నీటి బరువును కోల్పోవటానికి తరచుగా పుచ్చకాయ ముక్కలను తినాలి. పుచ్చకాయ రసాన్ని కూడా త్రాగవచ్చు. అలాగే పుచ్చకాయ రసంలో పెరుగు,మిరియాల పొడిని కలిపి వారంలో మూడు సార్లు త్రాగితే మంచి పలితం కనపడుతుంది.

3. దోసకాయ:

దోసకాయ అధిక నీటి కంటెంట్ మరియు శరీరం యొక్క pH స్థాయిలను నిర్వహిస్తుంది. ప్రతి రోజు ఆహారంలో దోసకాయ ముక్కలు ఉండేలా చూసుకోవాలి. అలాగే దోసకాయ రసాన్ని కూడా త్రాగవచ్చు. దోసకాయ రసంలో పుదినా,నిమ్మరసం కలిపి క్రమం తప్పకుండా త్రాగితే నీటి బరువు కోల్పోవటంలో బాగా సహాయపడుతుంది.

4. క్యారెట్లు:

క్యారెట్ నీటి బరువును తగ్గించటానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రతి రోజు ఆహారంలో క్యారెట్ ముక్కలు ఉండేలా చూసుకోవాలి. క్యారెట్ ముక్కలపై ఉప్పు,నిమ్మరసం పిండుకొని కూడా తినవచ్చు. అలాగే క్యారెట్, పాలు కలిపి మిక్సీ చేసి జ్యూస్ గా త్రాగవచ్చు. ప్రతి రోజు క్యారెట్ జ్యూస్ త్రాగితే బరువు కోల్పోవటంతో పాటు జీవక్రియకు కూడా సహాయపడుతుంది.