తలలో జిడ్డును తొలగించుకోవడానికి సులభమైన పద్ధతులు     2018-06-11   03:36:14  IST  Lakshmi P

ఈ రోజుల్లో చాలా మంది జుట్టుకు సంబందించిన సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో ప్రదానంగా తలలో జిడ్డు సమస్య. ఈ సమస్య తలలోని చర్మ గ్రందుల్లో అధికంగా నూనె ఉత్పత్తి కావటం వలన వస్తుంది. ఈ సమస్య నుండి బయట పడటానికి ఖరీదైన సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించ వలసిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే ఆ సమస్య నుండి సులభంగా బయట పడవచ్చు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

జుట్టును తడిగా ఉన్నప్పుడు దువ్వెనతో దువ్వకూడదు. అలాగే ఎక్కువ వేడిని కలిగించే డ్రైయర్స్ వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. జుట్టును ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వారానికి రెండు సార్లు తలస్నానము తప్పనిసరిగా చేయాలి.