తలలో జిడ్డును తొలగించుకోవడానికి సులభమైన పద్ధతులు

గుడ్డు తెల్లసొన జుట్టు సమస్యలకు మంచి పరిష్కారాన్ని చూపుతుంది. జుట్టు సమస్యలకు గుడ్డు తెల్లసొనను చాలా పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. తెల్లసొనలో ఉండే ప్రోటీన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు తలపై ఉన్న జిడ్డును చాలా సమర్ధవంతంగా తొలగిస్తుంది. గుడ్డు తెల్లసొనను తలకు బాగా పట్టించి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానము చేస్తే త్వరలోనే జిడ్డు సమస్య తొలగిపోతుంది.

జిడ్డు సమస్యకు ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా బాగా పనిచేస్తుంది. ఒక కప్పు నీటిలో రెండు స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి అరగంట అయ్యాక తలస్నానము చేయాలి.