వారంలో పిగ్మెంటేషన్ సమస్యకు పరిష్కారం... బెస్ట్ చిట్కా  

ఈ రోజుల్లో పిగ్మెంటేషన్ సమస్య అధికంగా ఉంది. ముఖం మీద మృత కణాలు పేరుకుపోవడం వలన ఈ పిగ్మెంటేషన్ సమస్య వస్తుంది. చర్మంపై మృత కణాలు తొలగిపోయి ముఖం మిల మిల మెరవటానికి ఒక మంచి చిట్కా గురించి తెలుసుకుందాం. ముఖ చర్మపైనా మృత కణాలు ఉండుట వలన చర్మం నిర్జీవంగా మారిపోతుంది. చర్మ కణాలలో చైతన్యం వచ్చి చర్మం తెల్లగా మారాలంటే ఈ చిట్కా బాగా సహాయపడుతుంది. మనం ఈ చిట్కాలో ఉపయోగించే అన్ని ఇంగ్రిడియన్స్ మనకు అందుబాటులో ఉండేవే. ఈ చిట్కాను చేయటం కూడా చాలా సులువు. ఈ చిట్కాకు కావలసిన పదార్ధాల గురించి తెలుసుకుందాం.

మొదటి ఇంగ్రిడియన్ గా నిమ్మకాయ రసాన్ని ఉపయోగిస్తున్నాను. నిమ్మరసంలో సిట్రస్ యాసిడ్ పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి ఆశ్చర్య కరమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. నిమ్మలో సహజ బ్లీచింగ్ గుణాలు ఉండుట వలన పిగ్మెంటేషన్ తొలగించటంలో సహాయపడుతుంది. నేను ఒక స్పూన్ నిమ్మరసాన్ని తీసుకున్నాను.

రెండో ఇంగ్రిడియాన్ గా బాదం నూనెను ఉపయోగిస్తున్నాను. బాదం నూనెలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , ఫాస్పోలిపిడ్స్, విటమిన్ ఇ మరియు మెగ్నీషియంలు అధికంగా ఉండుట వలన చర్మానికి పోషణను ఇవ్వటమే కాకుండా మృత కణాలను తొలగిస్తుంది. అలాగే చర్మ రంద్రాలు తెరుచుకోవటానికి సహాయపడుతుంది. ఇక్కడ అరస్పూన్ బాదం నూనెను తీసుకున్నాను.