ఈ 9 టిప్స్ పాటిస్తే...గురక సమస్య నుండి సులభంగా బయటపడొచ్చు.! ట్రై చేయండి!    2018-06-20   00:35:56  IST  Lakshmi P

స్థూలకాయం, వయస్సు మీద పడడం, శ్వాస నాళంలో ఇబ్బందులు, సైనస్ సమస్యలు, మద్యం సేవించడం, ధూమపానం… ఇలా కారణాలు ఏమున్నా మనలో అధిక శాతం మంది గురక సమస్యతో బాధపడుతున్నారు. ఇది కేవలం వారికే వారి పక్కన నిద్రించే వారికి కూడా ఇబ్బందే. ఈ క్రమంలో గురకను తగ్గించుకోవడం ఎలాగో తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే కింద ఇచ్చిన పలు సూచనలను పాటిస్తే గురక సమస్యను ఇట్టే తగ్గించుకోవచ్చు. ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఒక గ్లాస్ నీటిలో 1, 2 పిప్పర్‌మెంట్ ఆయిల్ చుక్కలు వేసి రాత్రి నిద్ర పోయే ముందు నోటిలో పోసుకుని బాగా పుక్కిలించాలి.

2. కొద్దిగా పిప్పర్‌మెంట్ ఆయిల్‌ను చేతి వేళ్లకు రాసుకుని వాసన చూస్తున్నా గురక సమస్య తగ్గిపోతుంది.

3. అర టీస్పూన్ తేనె, అర టీస్పూన్ ఆలివ్ ఆయిల్‌లను కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రపోయే ముందు తాగితే మంచి ఫలితం
కనిపిస్తుంది.

4. మరుగుతున్న నీటిలో 4 నుంచి 5 చుక్కల యూకలిప్టస్ ఆయిల్‌ను వేసి ఆవిరి పట్టాలి. నిద్రపోయే ముందు ఇలా చేస్తే గురక సమస్య తగ్గుతుంది.