పైల్స్ సమస్యను తగ్గించే అద్భుతమైన,సులభమైన చిట్కాలు     2018-06-12   23:07:32  IST  Lakshmi P

ఒక కప్పులో ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోని దానిలో కాటన్ బాల్ ముంచి నొప్పి ఉన్న ప్రాంతంలో రాయాలి. ఈ విధంగా రోజులో మూడు సార్లు రాయాలి.

ఒక బౌల్ లో ఒక కాయ నిమ్మరసం పిండి దానిలో పావు స్పూన్ తేనే,పావు స్పూన్ అల్లం రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న ప్రాంతంలో రాయాలి. ఈ విధంగా రోజులో మూడు సార్లు రాయాలి. ఈ మిశ్రమాన్ని రాసినప్పుడు కొంచెం మంట ఉంటుంది. అయినా ఈ చిట్కా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఒక బౌల్ లో ఆలివ్ ఆయిల్ తీసుకోని కాటన్ బాల్ ముంచి నొప్పి ఉన్న ప్రాంతంలో రాస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన తొందరగా నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.