రొజేషియా వ్యాధిని తగ్గించుకోవటానికి అద్భుతమైన ఇంటి చిట్కాలు     2018-06-27   23:26:55  IST  Lakshmi P

ప్రతి మహిళ ముఖం అందంగా,ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటుంది. అంతేకాక ముఖం అందంగా కనపడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాం. దాని కోసం ఎంత ఖర్చు పెట్టటానికి అయినా సిద్ధం అవుతాం. అయితే కొన్ని చర్మ సమస్యలు మాత్రం ఒక పట్టాన తగ్గవు. వాటిలో రొజేషియా వ్యాధి ఒకటి. ఈ వ్యాధి కారణంగా చర్మం చెంపలు దురద, వాపు, ఎరుపెక్కడం జరుగుతూ ఉంటుంది. ఈ వ్యాధిని కొన్ని అద్భుతమైన చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

అరస్పూన్ బాదం నూనెలో నాలుగు చుక్కల లావెండర్ నూనెను కలిపి ప్రభావిత ప్రాంతంపై రాసి సున్నితంగా 5 నిమిషాల పాటు మసాజ్ చేసి బాగా ఆరిన తరవాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

అరస్పూన్ ఆలివ్ నూనెలో మూడు చుక్కల అవిసె నూనెను వేసి బాగా కలిపి ప్రభావిత ప్రాంతంపై రాసి సున్నితంగా 5 నిమిషాల పాటు మసాజ్ చేసి 10 నిమిషాల తరవాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.