మైగ్రేన్ తలనొప్పిని త్వరగా తగ్గించే ఇంటి చిట్కాలు

మైగ్రేన్ తలనొప్పిని భరించటం చాలా కష్టం. తలకు ఒక వైపుకు మాత్రమే వచ్చే ఈ నొప్పి కొందరికి పార్శ్వ భాగానికే మాత్రమే పరిమితం అవుతుంది. మరికొందరికి తల మొత్తం వస్తుంది. తల మీద సుత్తితో కొట్టినట్టు ఉండటం, ముక్కు చుట్టూ ఎదో కదులుతూ ఉన్నట్టు అన్పించటం వంటి లక్షణాలు ఉంటాయి.

ఈ బాధ నుండి ఉపశమనానికి ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ మీద ఆధారపడుతూ ఉంటారు. అయితే ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తాయి. అందువల్ల మైగ్రేన్ తలనొప్పిని కొన్ని ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

తాజా ద్రాక్ష రసాన్ని త్రాగితే తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. రోజులో రెండు సార్లు త్రాగాలి.