Home Remedies for High Blood Pressure

ప్రస్తుతం ప్రపంచంలో బీపీ తో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మారిన జీవనశైలి, సరైన వ్యాయామం లేకపోవటం, ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవటం, మధ్యం తీసుకోవటం వంటి కారణాలతో బీపీ బారిన పడుతున్నారు. అయితే బిపిని అదుపులో ఉంచుకోవటానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

టమోటాలో విటమిన్ ఇ ,లైకోపిన్ వంటి యాంటీ యాక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన బిపికి కారణం అయ్యే ఫ్యాటి యాసిడ్స్ దమనులలో నిల్వ లేకుండా చేస్తుంది. తాజా టమోటా ముక్కలు లేదా తాజా టమోటా జ్యూస్ తీసుకోవాలి.

వెల్లుల్లి బీపీని తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. రక్తంలోని సోడియంను కిడ్నీలోకి నెట్టి బీపీని తగ్గించటంలో చాలా బాగా పనిచేస్తుంది. వెల్లుల్లిని సలాడ్స్,కూరల్లోనూ వేసుకొని తినవచ్చు.

బీట్రూట్ శరీరానికి అవసరమైన నైట్రేట్స్ ని సరఫరా చేస్తుంది. ఇవి బిపిని తగ్గించటానికి సహాయపడతాయి. అందువల్ల వారంలో మూడు సార్లు బీట్ రూట్ ని సలాడ్ రూపంలో తీసుకుంటే మంచిది. బీట్ రూట్ తినటం చాలా మందికి ఇష్టం ఉండదు. అటువంటి వారు జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.