ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే... క‌డుపులో మంట‌, గ్యాస్ ల నుంచి బయటపడవచ్చు    2017-10-13   22:43:16  IST 

సమయ పాలన లేని భోజనం,ఒత్తిడి, ఉప్పు, కారం, మ‌సాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవటం వంటి కారణాలతో గ్యాస్ సమస్య,కడుపులో మంట వస్తుంది. గ్యాస్ సమస్యకు కంగారు పడవలసిన అవసరం లేదు. మనకు ఇంటిలో అందుబాటులో ఉండే వస్తువులతో సమర్ధవంతంగా గ్యాస్ సమస్య నుండి బయట పడవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

అల్లం, తేనె, గోరు వెచ్చ‌ని నీరు, నిమ్మ‌ర‌సం
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఓక్ స్పూన్ అల్లం పేస్ట్,రెండు స్పూన్ల తేనే, కొంచెం నిమ్మరసం కలిపి ప్రతి రోజు ఉదయం పరగడుపున త్రాగితే గ్యాస్ సమస్య నుండి బయట పడవచ్చు.

అల్లం, తేనె, గోరు వెచ్చ‌ని నీరు
ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ అల్లం పేస్ట్ ,ఒక స్పూన్ తేనే కలిపి త్రాగాలి. ప్రతి రోజు ఉదయం త్రాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.