Home remedies for early white hair

తిప్పి తిప్పి కొడితే ఇరవై ఏళ్ళు ఉండవు కాని తెల్ల వెంట్రుకలు వచ్చేస్తాయి. ఇప్పుడు చాలామంది టీనే్జర్స్ లో కనిపించే సమస్యే ఇది. టీనేజ్ లోనే ఈ సమయస్య ఉంటే, ఇక ఇరవైల్లో ఇంకా ఎక్కువ అవదు ? చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉండవచ్చు కదా. చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు .. వాటిని వెతికి వెతికి పీకేసుకోవడం, లేదంటే కలర్ రాసుకోవడం (ఇక్కడ దొరికిపోతారు) .. కష్టమైన పనులే ఇవి. ఇలా కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేసే బదులు, అదే కష్టం మేం చెప్పే చిట్కాలలో పెట్టండి. ఫలితం ఉంటుంది.

* ఊసిరి ఈ సమస్యకు మంచి పరిష్కారం. విత్తులు తేసేసి ఊసిరిని బాగా గ్రైండ్ చేసి ఓ పేస్ట్ లాగా చేసుకోండి. దీన్ని రోజు మీ తలకి పట్టండి. ఓ 20 నిమిషాలు ఉంచేసి కడిగేస్తూ ఉండండి.

* ఆల్మండ్ ఆయిల్, ఊసిరి రసం, నిమ్మరసం .. ఈ మూడు కలిపిన మిశ్రమాన్ని రోజు తలకి పడితే కూడా మంచి ఫలితం ఉంటుంది. అయితే దీన్ని వెంట్రుకలకి పట్టాక, ఓ గంటపాటు కడిగేయకూడదు.