మోచేతులు నల్లగా ఉన్నాయా....అయితే ఈ చిట్కాలు ఫాలో అయ్యిపోండి  

ఎంత అందమైన డ్రెస్ వేసుకున్న మోచేతులు నల్లగా ఉంటే మాత్రం చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే లేత రంగు దుస్తులు వేసుకోవటానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. మోచేతుల నలుపు పోవటానికి ఖరీదైన కాస్మొటిక్స్ ఏమి వాడవలసిన అవసరం లేదు. మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

అరకప్పు నీటిలో పుదీనా ఆకులను వేసి మరిగించాలి. ఆ నీటిని వడకట్టి నిమ్మరసం కలపాలి. ఈ నీటిలో కాటన్ బాల్ ముంచి నల్లని మోచేతులపై రాసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది. ఇలా వారంలో మూడు సార్లు చేస్తూ ఉండాలి.