మోచేతుల నలుపును తగ్గించే అద్భుతమైన ఇంటి చిట్కాలు     2018-06-13   01:02:09  IST  Lakshmi P

తాజా బంగాళాదుంపను తీసుకోని జ్యుస్ చేయాలి. ఈ జ్యుస్ ని మోచేతులపై రాశి 20 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజులో రెండు సార్లు చేయాలి.

అరస్పూన్ బేకింగ్ సోడాలో ఒక స్పూన్ డిస్టిల్డ్ వాటర్ కలిపి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని నల్లగా మారిన మోచేతులపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

తాజా పెరుగును నల్లగా ఉన్న మోచేతులపై రాసి 20 నిముషాలు తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజులో మూడు నుంచి నాలుగు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.