మీ పాదాలపై ఆనెకాయలను తగ్గించే అద్భుతమైన ఇంటి చిట్కాలు     2018-03-06   22:34:28  IST  Lakshmi P

Home Remedies for Corns on Feet

ఎవరికైనా పాదాలపై ఆనెకాయలు వస్తే నొప్పితో పాటు చాలా చిరాకు కూడా కలుగుతుంది. అవి నొప్పిని కలిగించటమే కాకుండా చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఇవి సాధారణంగా కాలివేళ్ళ మధ్యన, మడమల వద్ద ఏర్పడుతూ ఉంటాయి. ఆనెకాయలు వచ్చినప్పుడు గట్టిగా,కఠినంగా మారిపోతుంది. ఆ ప్రదేశంలో మృత కణాలు బాగా పేరుకుపోవడం వలన ఆనెకాయలు ఏర్పడతాయి. ఆనెకాయలను తగ్గించటానికి మంచి మంచి ఇంటి చిట్కాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

విటమిన్ E ఆయిల్
చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించి ఆ ప్రదేశాన్ని తేమగా ఉంచి ఆనెకాయలను తగ్గించటంలో సహాయపడుతుంది. రాత్రి సమయంలో ఆనెకాయలు ఉన్న ప్రదేశంలో విటమిన్ E ఆయిల్ ని రాసి పాదాలను సాక్స్ తో కవర్ చేసి మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి 4 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.