నోటు పై గాంధీ గారి బొమ్మ ఎలా వచ్చిందో తెలుసా? అసలు ఆ ఫోటో ఎప్పుడు, ఎక్కడ, ఎవరు తీశారంటే!     2018-08-16   10:47:17  IST  Sainath G

రైలు బండిని నడిపేది “పచ్చ జెండా” అయితే, మన బతుకు బండిని నడిపేది “పచ్చ నోటు”! పైసా లో పరమాత్మఉందనుకుంటాము. “వేదం” సినిమాలో చెప్పినట్టు జేబులు నుండి జేబులలోకి ఎగిరే కాగితమే రూపాయి. మొన్నీ మధ్య మోడీ గారు 500 , 1000 నోట్లు బాన్ చేసి నోటు కష్టాలు చూపించారు. పది రూపాయల నోటు నుండి రెండు వేల రూపాయల నోటు వరకు అన్నిటి మీద “గాంధీ” గారి ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ఎప్పుడు తీసింది? అసలు గాంధీ గారి ఫోటో నోటు మీద ఎప్పటినుండి అచ్చు వేశారు? నోటు కథ ఏంటో చూడండి!

Indian Currency Notes,Mahatma Gandhi Picture

నోటు పై “గాంధీ” గారి బొమ్మ డ్రాయింగ్ వేసింది కాదు. ఒక అజ్ఞ్యాత ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో. “గాంధీ” గారు నవ్వుతూ “లార్డ్ ఫ్రెడ్రిక్ లారెన్స్” గారి పక్కన నించునప్పుడు తీసిన ఫోటో అది. ఫ్రెడ్రిక్ లారెన్స్, బ్రిటిష్ రాజకీయ నాయకుడు. బ్రిటన్ లో మహిళా శ్రేయస్సు కోసం పోరాడారు. భారత- బర్మా కి సెక్రటరీ గా కూడా పనిచేసారు!

Indian Currency Notes,Mahatma Gandhi Picture

1946 లో “గాంధీ” గారు “ఫ్రెడ్రిక్” ని కలిసినప్పుడు ఒక జర్నలిస్ట్ తీసిన ఫోటో అది. వైస్రాయ్ హౌస్ (ఇప్పుడు రాష్ట్రపతి భవన్) దగ్గర తీసిన ఫోటో అది. ఆ ఫొటోలో “గాంధీ” గారిని క్రాప్ చేసి మిర్రర్ ఫోటో చేసి నోటు పై అచ్చు వేశారు!

Indian Currency Notes,Mahatma Gandhi Picture

1987 లో మొదట 500 నోటు పై “గాంధీ” గారి ఫోటో ముద్రించారు.

1996 నుండి అన్ని నోట్ల పై గాంధీ గారి ఫోటో అచ్చు వేయడం ప్రారంభమయ్యింది. అంతకముందు నోటు పై “అశోక స్థంభాలు” ఉండేవి!

1996 లో 500 రూపాయల నోటు రూపు రేకలు మార్చారు

2016 లో 500 , 2000 రూపాయల నోట్లపై మిర్రర్ ఫోటో ఉపయోగించకుండా ఒరిజినల్ ఫోటో ఉపయోగించారు!

Indian Currency Notes,Mahatma Gandhi Picture