హీరోల మీటింగ్‌.. ఫలితం జీరో!     2018-05-02   01:01:05  IST  Raghu V

తెలుగు సినిమా పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా ఉద్యమంను ప్రారంభించిన శ్రీరెడ్డి మెల్ల మెల్లగా తన ఉద్యమంను తీవ్రతరం చేసింది. శేఖర్‌ కమ్ముల, నాని, కోన వెంకట్‌, దగ్గుబాటి అభిరామ్‌ ఇలా పలువురిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఆ తర్వాత రామ్‌ గోపాల్‌ వర్మ సూచన మేరకు పవన్‌ కళ్యాణ్‌ను రాయడానికి వీలు లేని భాషలో తిట్టడం జరిగింది. శ్రీరెడ్డి వ్యాఖ్యల వెనుక తాను ఉన్నాను అంటూ వర్మ బాహాటంగా ప్రకటించడంతో పవన్‌ కళ్యాణ్‌ రెచ్చి పోయాడు. తనను, తన తల్లిని దూషించిన వ్యక్తిపై, ఆ వెనుక ఉన్న వ్యక్తిపై కఠిన చర్యు తీసుకోవాల్సిందే అంటూ ఫిల్మ్‌ ఛాంబర్‌లో హంగామా సృష్టించిన విషయం తెల్సిందే.

దాదాపు అయిదు గంటల పాటు పవన్‌ కళ్యాణ్‌ ఛాంబర్‌లో ఉండి నిరసన తెలియజేశాడు. దాంతో ఆ తర్వాత రోజే సినిమా పరిశ్రమకు చెందిన 24 విభాగాల వారు కూడా అన్నపూర్ణ స్టూడియోలో భేటీ అయిన విషయం తెల్సిందే. ఆ భేటీలో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ తర్వాత చిరంజీవి పిలుపు మేరకు అదే అన్నపూర్ణ స్టూడియోలో దాదాపు రెండు గంటల పాటు భేటీ అయ్యారు. ఆ భేటీ జరిగింది వారాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు భేటీకి సంబంధించిన వివరాలు వెళ్లడి కాలేదు. అసు ఆ భేటీ ఎందుకు జరిగింది, అక్కడ ఏం చర్చించారు అనే విషయాు వెళ్లడవ్వలేదు.