ఫిదా వదిలేసి బొమ్మరిల్లుపై పడ్డ నితిన్‌..సక్సెస్‌ దక్కేనా     2018-07-05   01:01:58  IST  Raghu V

నితిన్‌ ‘లై’ మరియు ‘ఛల్‌ మోహన్‌ రంగ’ చిత్రాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ ఫ్లాప్‌ అయ్యాడు. వరుసగా రెండు చిత్రాలు ఫ్లాప్‌ అవ్వడంతో నితిన్‌ కాస్త టెన్షన్‌లో పడ్డాడు. ఈ సమయంలోనే ఈయన చేసిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. శతమానంభవతి చిత్రం టీం దిల్‌రాజు, సతీష్‌ వేగేశ్నల కాంబోలో తెరకెక్కిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. మొదటి రోజు నుండి ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన విడుదలైన ప్రతి పోస్టర్‌ ఆకట్టుకుంటూ వచ్చింది. దాంతో సినిమాపై ఆసక్తి, అంచనాలు భారీగా పెరిగాయి.

దిల్‌రాజు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన ఈ చిత్రంను మొదట ‘ఫిదా’ విడుదల అయిన తేదీన విడుదల చేయాలని భావించారు. కాని అది సాధ్యం కాలేదు. షూటింగ్‌ అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యంగా జరగడంతో జులైలో విడుదలకు మీ పడలేదు. ఫిదా సెంటిమెంట్‌ను మిస్‌ అయిన నిర్మాత దిల్‌రాజు బొమ్మరిల్లు సెంటిమెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రాన్ని ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.