రజనీకాంత్ పార్టీలోకి మొట్టమొదట అడుగుపెట్టిన హీరో     2018-01-03   00:07:44  IST  Bhanu C

Hero lawrence looking into rajinikanth party

రజనీకాంత్ ఇలా పార్టీ పెట్టాడో లేదో ఆశావాహులు ఎప్పుడు ఎప్పుడు రజనీ పార్టీలోకి దూకేద్దమా అని అనుకుంటున్నారు..అయితే రజనీ మాత్రం ఆచితూచి పార్టీలోకి వచ్చే వ్యక్తులపై నిర్ణయం తీసుకుంటున్నారు..అయితే తాజాగా రజనీ ఒక హీరోకి తన పార్టీలోకి వెల్కమ్ చెప్తున్నారు అని తెలుస్తోంది…రజనీకాంత్ కి మద్దతుగా ఎంతో మంది నిలుస్తున్నారు..అయితే రజనీని స్పూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి రావడానికి తమిళ హీరో రాఘవా లారెన్స్ సిద్దమైనట్టుగా తెలుస్తోంది..

ఈ విషయంపై మీడియాకి సైతం సమాచారం ఉన్నట్టుగా తెలుస్తోంది.లారెన్స్ రజనీ పార్టీలో చేరే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు అని టాక్ అయితే..ఇప్పటిదాకా పార్టీ పేరు గాని,పార్టీ విధి విధానాలు గాని ప్రకటించని రజనీకాంత్…కేవలం రజని నోటి మాటకె ఇంత ప్రాధాన్యత సంతరించుకుంటే ఇక పార్టీ విధి విధానాలు ప్రకటించే నాటికీ ఎంతమంది పార్టీ లోకి వస్తారో అర్థం చేసుకోవచ్చు..కానీ రజనీ కాంత్ కి పార్టీలో ఎవరిని తీసుకోవాలి అనే విషయంలో ఒక స్పష్టత ఉందని తెలుస్తోంది..

లారెన్స్ రాజకీయ ప్రకటన చేసిన వెంటనే రజనీని లారెన్స్ కలవబోతున్నాడని సమాచారం.అయితే రజనీకి కూడా లారెన్స్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది…ఇద్దరూ రాఘవేంద్రస్వామి భక్తులే…రజినీకాంత్ కి కూడా లారెన్స్ అంటే మొదటి నుంచీ చాలా ప్రేమ…త్వరలో స్థాపించబోయే తన పార్టీ లో లారెన్స్ కి మంచి స్థానం ఇవ్వాలనేది రజినీకాంత్ ఆలోచన అంటున్నారు…అయితే రజనీ లారెన్స్ వైపు మొగ్గు చుపడానికి కారణం మాత్రం లారెన్స్ చేసే అనేక సేవా కార్యక్రమాలే అని అంటున్నారు..మరి రజనీ లారెన్స్ కి ఎటువంటి పదవి కట్టబెడుతారో అంటూ అందరు ఎదురు చూస్తున్నారు..