శరీరాన్ని శుద్ధి చేసి విషాలను బయటకు పంపే ఇంటి చిట్కాలు     2017-10-06   22:15:17  IST  Lakshmi P

Herbs That Detox Your Body Naturally

సీజన్ మారినప్పుడు మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి ఇన్ ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే శరీరంలో విషాలు కూడా పేరుకుపోతాయి. తేలికపాటి ఆహారంను మితంగా తీసుకోని విషాలను శరీరంలో నుంచి బయటకు పంపవచ్చు. అలాగే కొన్ని ఆహారాల ద్వారా కూడా విషాలను బయటకు పంపవచ్చు. వాటి గురించి వివరాలను తెలుసుకుందాం.

కొత్తిమీర
శరీరంలో విషాలను బయటకు పంపటంలో కొత్తిమీర బాగా సహాయపడుతుంది. దీనిలో ఆవశ్యక నూనెలు ఉండుట వలన బ్యాక్టీరియాను చంపి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొత్తిమీర జీర్ణ వ్యవస్థను మెరుగుపరచి వికారాలను తగ్గిస్తుంది. అలాగే రక్తంలో చక్కర స్థాయిలను బాలన్స్ చేస్తుంది. కూరలు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీరను జల్లితే రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది.

త్రిఫల చూర్ణం
త్రిఫల చూర్ణంలో ఉన్న గుణాలు విషాలను బయటకు పంపటంలో సహాయపడతాయి. త్రిఫల చూర్ణంను ఉసిరి కాయ, కరక్కాయ, తానికాయలతో తయారుచేస్తారు. అరకప్పు వేడినీటిలో ఒక స్పూన్ త్రిఫల చూర్ణాన్ని కలిపి చల్లారిన తర్వాత త్రాగాలి.