పోలీస్ అవ్వడానికి హైట్ తక్కువ ఉన్నాడని..ఫిసికల్ టెస్ట్ లో అతను ఏం చేసాడో తెలుసా? కానీ చివరికి!     2018-06-30   22:04:01  IST  Bhanu C

పోలీసు ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం అని అందరికి తెలిసందే. ఫ్లాన్‌ వేసి అధికారులను బురిడీ కొట్టించాలనుకున్నాడు. అయితే ఫిజికల్‌ టెస్టులో అతగాడి వ్యవహారం బయటపడింది. ప్లాన్ మొత్తం బోల్తా కొట్టింది. వివరాలలోకి వెళ్తే..!

అంకిత్ కుమార్.. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన ఈ కుర్రాడికి చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలన్నది కల. అందుకోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నాడు. తాజాగా ఎస్సై ఉద్యోగాల కోసం విడుదలైన నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు.. రాత పరీక్షను విజయవంతంగా ముగించగా.. ఫిజికల్ టెస్టులు మిగిలి ఉన్నాయి. అయితే ఎత్తు సమస్య అతని పాలిట శాపంగా మారింది. నిబంధనల ప్రకారం 168 ఎత్తు కాగా, అంకిత్‌ ఓ సెంటీమీటర్‌ తక్కువగా ఉన్నాడు. దీంతో ఎత్తు పెరిగేందుకు అడ్డమైన మందులు వాడాడు.. ఫిజికల్‌ ఎక్సర్‌సైజ్‌లు చేశాడు. అయినా లాభం లేకుండా పోయింది. దీంతో ఓ ఫ్లాన్‌ వేశాడు.