Heavy Coffee intake would cut chances of pregnancy – Study

కాఫీ లిమిటెడ్ గా తాగితే ఎంత లాభాకరమో, హద్దు దాటితే అంటే బాధాకరం కూడా. అవును, కాఫీ అలవాటుకి హద్దు అదుపు లేకపోతే అది విషంగా మారవచ్చు. పురుషులు అతిగా కాఫీ తాగితే అది వీర్యకణాల ఉత్పత్తిపై ప్రభావం చూపి, వీర్యాన్ని బలహీనపరుస్తుంది అని ఇప్పటికే తెలుసుకున్నాం. పురుషులైతే, రోజుకి 265 మిల్లిగ్రాములు కేఫైన్,లేదా మూడు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగకపోవడమే మంచిది. మరి అమ్మాయిల సంగతి ఏంటి ? వారు మాత్రం ఇష్టం వచ్చినంత తాగవచ్చా ?

లేదు. ఇంకా అబ్బాయిలైనా మూడు కప్పులు తీసుకుంటే ఫర్వాలేదు కాని, అమ్మాయిలయితే రెండోవ కప్పు దాటకూడదు అంటున్నారు పరిశోధకులు. రోజుకి 200 మిల్లిగ్రాముల కన్నా ఎక్కువ కేఫైన్ అమ్మాయిల ఒంట్లో పడిపోతూ పొతే, అది గర్భధారణకి అడ్డంకిగా మారవచ్చు అని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. అంతే కాదు, గర్భం దాల్చిన వారు ఎక్కువ కాఫీ తాగితే బిడ్డకి చాలా ప్రమాదమని, కాఫీ అంటే ఎంత మక్కువ ఉన్న సరే, గర్భవతి అని తెలియగానే, డెలివరి వరకు కాఫీ అలవాటు మానిపించాలని సూచిస్తున్నారు.

ఇక గర్భం దాల్చని అమ్మాయిలు రోజుకి రెండు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తీసుకోకూడదు అని, లేదంటే మాతృత్వం ఆశలు వదిలేసుకోవాలని చెబుతున్నారు. విన్నారుగా … జాగ్రత్త అమ్మాయిలు