భవిష్యత్తులో మనకి గుండె పోటు వస్తుందో రాదో మనమే తెలుసుకోవచ్చు.! అదెలా అంటే.?

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు వెరసి చిన్నా పెద్దా తేడా లేకుండా గుండె జబ్బులొస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండానే.. అంటే 30, 40 ఏళ్లలోనే గుండె జబ్బులతో అనేక మంది ప్రాణాలు వదులుతున్నారు. అయితే ఈ గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని ముందు పసిగట్టొచ్చు అంటున్నారు వైద్యులు. దీనికి అతి పురాతనమైన టెక్నిక్ నాడీ వైద్యం భాగా ఉపయోగపడుతుందట. దీనిని ఉపయోగించి గుండె జబ్బుల సమస్యలను ముందే తెలుసుకుని సరైన సమయంలో డాక్టరు ను సంప్రదించి ప్రాణాపాయాన్ని తప్పించుకోవచ్చు. అంతే కాదు గుండె వ్యాధులను మొదట్లోనే గుర్తిస్తే వాటిని అధిగమించడం సులువు. లేకుంటే లక్షల్లో ఖర్చుతో పాటుగా జీవితమే రిస్క్ లోకి వెళుతుంది. ఇంతకూ గుండె జబ్బులను నాడీ వైద్యం ద్వారా ఎలా తెలుసుకోవాలంటే..

నాడీ పట్టుకొని మన ఆరోగ్యస్థితిని చెప్పొచ్చు. ఇప్పటికీ ఏదయినా అనారోగ్యంతో డాక్టర్ వద్దకు వెళితే నాడీ పట్టుకుని చూస్తారు. మణికట్టు వద్ద బొటన వేలు కిందిభాగంలో రెండు వేళ్లతో గట్టిగా అదిమి పట్టి నాడిని పరీక్షించాలి. అయితే విశ్రాంతి సమయంలో నాడి వేగాన్ని బట్టి గుండె స్టితిని చెప్పొచ్చు. అందుకే విశ్రాంతిగా ఉన్నప్పుడు 30 సెకన్లలో నాడి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో లెక్కించి దాన్ని రెట్టింపు చేస్తే ఒకనిమిషానికి గుండె కొట్టుకునే వేగాన్ని తెలుసుకోవచ్చు. విశ్రాంతి సమయంలో గుండె వేగం ఎంత తక్కువగా ఉంటే శారీరక సామర్థ్యం అంత మంచిగా ఉందని అర్థం .అదే విశ్రాంతి సమయంలో గుండె వేగం ఎక్కువగా ఉంటె గుండెజబ్బుల సమస్యల ఎక్కువగా వచ్చే ప్రమాదం పొంచి ఉన్నట్టేనట. అలాగే..