కరివేపాకు గురించి తెలిస్తే ప్రతి రోజు వదలకుండా తింటారు...అసలు పాడేయరు     2018-04-17   23:33:39  IST  Lakshmi P

కరివేపాకును మనం ప్రతి రోజు వంటల్లో వేస్తూ ఉంటాం. కరివేపాకు వంటకు రుచిని ఇవ్వటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే చాలా మంది వంటల్లో వేసిన కరివేపాకును ఏరి పారేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే కరివేపాకును పాడేయకుండా తింటారు. ఇప్పుడు ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

కరివేపాకు చెట్టు కాడలు, బెరడును కషాయంగా తయారుచేసి త్రాగితే త్వరగా రక్తపోటు తగ్గుతుంది. అయితే వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే త్రాగాలి.

మూత్ర పిండాల సమస్యలు ఉన్నవారు ప్రతి రోజు ఆహారంలో కొన్ని కరివేపాకు ఆకులను కలిపి తినాలి. ఆలా తినలేని వారు రెండు రోజులకు ఒకసారి కరివేపాకు జ్యుస్ త్రాగితే మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోతాయి.