టైట్ గా ఉండే అండర్ వేర్ వేసుకుంటున్నారా.? అయితే ఈ 6 విషయాలు తప్పక తెలుసుకోండి.!    2018-06-15   06:37:55  IST  Lakshmi P

‘జిహ్వకోరుచి’ అన్న చందంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాలందరూ తమ ఇష్టాలకు అనుగుణంగా రక రకాల డిజైన్లు, కలర్లు కలిగిన ఆకర్షణీయమైన ఫ్యాషనబుల్ దుస్తులను ధరించడానికి ఇష్టపడతారు. అయితే ఎవరు ఏ రకం డ్రెస్ వేసుకున్నా అందరూ కామన్‌గా ధరించేది మాత్రం ఒక్కటే. అదే అండర్ వేర్. స్త్రీ, పురుషులెవరైనా అండర్‌వేర్‌ను తప్పనిసరిగా ధరిస్తారు. కొంత మంది అండర్‌వేర్‌ను ధరించరు లెండి. అది వారి స్వవిషయం. అలాంటి వారిని పక్కన పెడితే అసలు అండర్‌వేర్స్ వల్ల మనకు ఏ విధమైన నష్టాలు కలుగుతాయో, ఎలాంటి అండర్‌వేర్‌ను ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మరీ చిన్నవిగా ఉన్న అండర్‌వేర్స్‌ను ధరించకూడదు. మరీ పెద్దగా ఉండే థాంగ్స్ వంటి అండర్‌వేర్స్‌ను, సింథటిక్, సిల్క్ క్లాత్‌తో తయారు చేసిన అండర్‌వేర్స్‌ను ధరించకూడదు. ఇవన్నీ మనకు అపరిశుభ్రతను, అనారోగ్యాలను కలగజేస్తాయట. థాంగ్స్ వంటి అండర్‌వేర్‌తో ఈ-కోలి బాక్టీరియా సులభంగా వ్యాపించగలుగుతుందట. దీని వల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చి అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో యూరిన్ ఇన్‌ఫెక్షన్లు కూడా వస్తాయట.

2. శారీరక శ్రమ లేదా వ్యాయామం అనంతరం చెమట పట్టిన అండర్‌వేర్‌ను అలాగే ధరించకూడదు. దాని స్థానంలో పొడి అండర్‌వేర్‌ను ధరించాలి. లేదంటే ఇన్‌ఫెక్షన్స్ వస్తాయి.