మొల‌కెత్తిన గింజ‌లను తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?  

మొలకెత్తిన గింజలలో ప్రోటీన్లు, విటమిన్స్, మినరల్స్ వంటి పోషక విలువలు సమృద్ధిగా ఉండి మన ఆరోగ్యానికి చాలా మేలును చేస్తాయి. వీటిని ఇంటిలోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. ప్రతి రోజు ఒకే రకానికి చెందిన మొలకలు తినటం కన్నా రెండు మూడు రకాల మొలకలను తింటే మంచిదని నిపుణులు అంటున్నారు. అప్పుడు మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. మ‌రి ఏయే మొల‌కెత్తిన గింజ‌ల‌తో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ముందుగా మొలకలు ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. గింజలను 10 నుంచి 12 గంటలపాటు నానబెట్టి శుభ్రంగా కడగాలి. గింజల్లో నీరు లేకుండా వడకట్టి పొడి క్లాత్ లో పోసి గట్టిగా చుట్టి ఉంచాలి. ఒక రోజులో మొలకెలు వస్తాయి. మొలకలు వచ్చిన వాటిని తీసేసి, మరల మొలకలు రాని గింజలను మూట కట్టాలి. వీటిని ఫ్రిడ్జ్ లో పెడితే వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. అయితే రెండు రోజులకు ఒకసారి నీటిని చల్లాల్సి ఉంటుంది.

శనగలు
వంద గ్రాముల శనగల్లో 115 క్యాలరీల శక్తి, 7.2 గ్రాముల ప్రోటీన్లు, 16.1 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 2.9 గ్రాముల కొవ్వు పదార్థాలు, ఫైబర్ ఉంటాయి. ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన రక్తంలో హానికరమైన కొవ్వులు తగ్గిపోతాయి. అధిక మోతాదులో ప్రోటీన్లు లభించటం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది. వీటిలోని ప్రత్యేక పదార్థాలు నిద్ర రావడానికి సహాయపడతాయి.