ఈ సీజన్ లో సబ్జా గింజల డ్రింక్ త్రాగాలి.... ఎందుకో తెలిస్తే మానకుండా త్రాగుతారు     2018-03-16   01:01:35  IST  Lakshmi P

Health benefits Of Sabja Seeds

వేసవి కాలం వచ్చేసింది. ఇప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బ తగలటం,అలసట,నిస్సత్తువ వంటివి వస్తాయి. అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకప్పుడు శరీరంలో వేడి చేసినదని అనిపించినప్పుడు స‌బ్జా గింజ‌ల‌ను నాన‌బెట్టుకుని పంచదార కలుపుకొని త్రాగేవారు. ఈ పానీయాన్ని ఉదయం త్రాగితే మంచిదని ఆయుర్వేదం చెప్పుతుంది. ప్రతి రోజు సబ్జా పానీయం త్రాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.

సబ్జా గింజల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్లు, పీచు ప‌దార్థం, ఫోలేట్‌, నియాసిన్, విట‌మిన్ ఇ వంటి అనేక పోషకాలు మన శరీరానికి బాగా అందుతాయి.

ప్రతి రోజు సబ్జా పానీయాన్ని త్రాగటం వలన శరీరంలో ద్రవాల స్థిరీకరణ జరుగుతుంది.

సబ్జా గింజల పానీయాన్ని ప్రతి రోజు త్రాగితే వేసవి కాలం ఎండ తీవ్రత మన మీద ఉండదు.

సబ్జా గింజల పానీయంలో పంచదార వేయకుండా త్రాగితే రక్తంలో చక్కర స్థాయిలు తగ్గి మధుమేహం అదుపులోకి వస్తుంది.