Health Benefits of Pulses

తక్కువ కేలరీలు ఎక్కువ పోషకాలు ఉన్న పప్పులు శాఖాహారులకు చాలా బాగా సహాయపడతాయి. పప్పులను భారతదేశంలో అన్ని ప్రాంతాల వారు రకరకాలుగా వంటల్లో ఉపయోగిస్తారు. వీటిల్లో పీచు, ప్రోటీన్స్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన కలిగి తొందరగా ఆకలి వేయదు. అంతేకాక నెమ్మదిగా జీర్ణం అవుతూ ఉండటం వలన రక్తంలో చక్కెర వెంటనే విడుదల కాదు. అటువంటి పప్పులతో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది


పప్పులలో కరిగే ఫైబర్ అధిక స్థాయిలో ఉండుట వలన రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించటానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం మరియు ధమనులను శుభ్రంగా ఉంచడం ద్వారా గుండె వ్యాధులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

2. గుండె ఆరోగ్యం


అనేక అధ్యయనాలలో అధిక ఫైబర్ ఉన్న పప్పుల వంటి ఆహారాలను తీసుకుంటే గుండె వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని తెలిసింది. పప్పులలో ఫోలేట్ మరియు మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఫోలేట్ హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గించి ప్రమాదకరమైన గుండె వ్యాధిని తగ్గిస్తుంది. మెగ్నీషియం రక్త ప్రవాహం, ఆక్సిజన్ మరియు పోషకాలు శరీరం అంతటా విస్తరించేలా సహాయపడుతుంది. కాబట్టి పప్పులను తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.