దానిమ్మ తొక్కతో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే...     2018-05-11   22:17:45  IST  Lakshmi P

దానిమ్మ పండులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు,ఎన్ని పోషకాలు ఉన్నాయో మనకు తెలిసిన విషయమే. దానిమ్మ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు, కాల్షియం, విట‌మిన్ సి, ఐర‌న్‌, విట‌మిన్ బి6, మెగ్నిషియం వంటి పోష‌కాలు సమృద్ధిగా ఉన్నాయి. దాంతో మనం దానిమ్మ తొక్క తీసి పాడేసి దానిమ్మ గింజలను మాత్రమే తింటూ ఉంటాం. అయితే దానిమ్మ తొక్కలో ఉన్న ప్రయోజనాలు,పోషకాల గురించి తెలిస్తే తొక్కను పాడేయకుండా తింటారు. ఇప్పుడు వాటిలో ఉన్న పోషకాలు,ప్రయోజనాలు తెలుసుకుందాం.

సాధారణంగా ఎవరు దానిమ్మ తొక్కను తినటానికి ఇష్టపడరు. దానిమ్మ తొక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సలాడ్ లలో కలుపుకొని తినవచ్చు. ఇలా తినటం వలన శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్ అందటమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.