జాజికాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?     2018-05-09   03:55:06  IST  Lakshmi P

జాజికాయను మనం ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తున్నాం. జాజికాయ వంటలకు రుచిని కలిగిస్తుంది. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ ప్రయోజనాల గురించి తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుస్కుందాం.

జాజికాయను నేతిలో వేగించి పొడి చేసుకొని ఉంచుకోవాలి. 5 గ్రాముల పొడిని ఆవుపాలతో కలిపి తీసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అయితే జాజికాయను మోతాదు ప్రకారం మాత్రమే తీసుకోవాలి.

తాంబూలం వేసుకొనేటప్పుడు చిటికెడు జాజికాయ పొడి వేసుకొంటే నోటి దుర్వాసనతో పాటు పంటి మీద నలుపునూ, గార తొలగిపోయి పళ్ళు మిలమిల మెరుస్తాయి.