కంద తో ఫైల్స్ సమస్యలు మాయం

కంద..కందగడ్డ అన్నా ఒక్కటే..భారతదేశ చరిత్రలో కందకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది..ఇప్పుడు ఉన్న ఎన్నో రకాల కూరగాయలు పూర్వం నుంచీ లేవు,అడవులలో విస్తారంగా పండే ఈ కంద ఒకప్పుడు మునులు,అడవులలో నివసించే వివిధ జాతులవారికి ప్రధాన ఆహరం గా ఉండేది కంద.కంద మన భారతదేశానికి చెందినది.కంద లో ఉండే గొప్ప లక్షణాలని ఇప్పుడు చూద్దాం.

కంద ని పూర్వం నుండే ఆహార పదార్ధంగా నే కాకుండా ఆరోగ్య సంభందిత పదార్ధం గా వినియోగించే వారు.ఇది చాలా బలవర్ధకమైన ఆహారం.ఇందులో పోషక విలువలు ఔషధ గుణాలు ఉన్నాయ్. కంద పైన ఉండే పొరని తీసేసి కంద గడ్డని పలుచని ముక్కలు గా కోసి ఎండబెట్టి పొడి గా చేయాలి.అదేవిధంగా బెల్లం కూడా తీసుకుని దంచి పొడి చేసుకోవాలి ఈ రెండు పొడుల మిశ్రమాన్ని సమపాళ్ళలో కలిపి ఉసిరి సైజులో ఉండలు చేసి ఉదయం,రాత్రి సమయంలో ఒకటి తీసుకుంటే మొలలకి శాశ్వత పరిష్కారం ఉంటుంది. అజీర్తిని కూడా ఇది తగ్గిస్తుంది.

వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో,ఏముకలు ధృడత్వానికి కంద చాలా బాగా ఉపయోగపడుతుంది. కందగడ్డలో విటమిన్ ఎ చాలా ఎక్కువగా ఉంటుంది. లోగ్లిజమిక్ ఇండెక్స్, బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలన్స్ చేస్తుంటుంది. బీటా కెరోటీన్ చాలా తక్కువగా ఉంటుంది. దీనిని తినడం వల్ల షుగర్ ఒబిసిటీలను అదుపులో కంట్రోల్ చేయవచ్చు.