పరగడుపునే గ్లాస్ వేడి నీటిలో పసుపు కలిపి తాగితే..నమ్మలేని అద్భుతమైన ప్రయోజనాలు  

మనం ప్రతి రోజు వంటల్లో పసుపును ఉపయోగిస్తాం. పసుపులో విటమినులు, లవణాలతో పాటు శరీర ఆరోగ్యానికి సహాయపడే ఫైటిన్‌, ఫాస్ఫరస్‌ సమృద్ధిగా ఉంటాయి. పసుపు ఒక సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్‌గా పనిచేసి గాయాలు, పుండ్లను త్వరగా మానేలా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు మన శరీరాన్ని ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి రక్షిస్తాయి. పసుపులో ఉండే కర్‌క్యుమిన్‌ శరీర ఆరోగ్యంలో ప్రముఖమైన పాత్రను పోషిస్తుంది. ప్రతి రోజు పరగడుపున ఒక గ్లాస్ వేడి నీటిలో 1/4 టీ స్పూన్ పసుపు కలుపుకుని తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పరగడుపునే గ్లాస్ వేడి నీటిలో పసుపు కలుపుకుని తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గి మధుమేహం అదుపులో ఉంటుంది.

సహజ సిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉండుట వలన నొప్పులు,వాపులు తగ్గుతాయి. ముఖ్యంగా కీళ్లనొప్పులు ఉన్నవారు త్రాగితే చాలా మేలు చేస్తుంది.